ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం..
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతన గృహ ప్రవేశం చేసిన ఇందిరమ్మ ఇండ్లను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ ప్రారంభించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ లోని కనకమ్మ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ఆ ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేఖను లబ్ధిదారులు శాలువాతో సన్మానించారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు… సురేఖకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు వేల్పుల రవీందర్, బండారి సుధాకర్, పత్తి ప్రకృతి, నస్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి నూకల రమేష్ తదితరులు పాల్గొన్నారు..