ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం
అమెరికా- ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అల్ ఖమేనీ (86) హతమయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ ఖమేనీ కార్యాలయంపై కామికోజు డ్రోన్లు, మిస్సైళ్లతో జరిపిన దాడుల్లో ఖమేనీ కుటుంబ సభ్యులతో సహా చనిపోయారు. ఖమేనీ, కూతురు, అల్లుడు, మనవరాలు కూడా ఈ దాడిలో చనిపోయినట్లుగా ఇరాన్ అధికారిక మీడియా, రెవల్యూషనరీ గార్డు దృవీకరించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం తమ దాడిలో ఖమేనీ చనిపోయినట్లుగా ప్రకటించారు. శనివారం ఇరాన్ వ్యాప్తంగా ఉన్న సైనిక, అణు అనుబంధ కేంద్రాలే లక్ష్యంగా భారీ దాడులు నిర్వహించాయి.
ఖమేనీ మరణంపై ఆ దేశ రెవల్యూషనరీ గార్డ్ తీవ్రంగా స్పందించింది. అమెరికా. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమెనీ చనిపోయినట్లు వెల్లడించింది. ఖమేనీ స్థానంలో తర్వాతి సుప్రీం లీడర్ ఎవరన్నది ప్రకటిస్తామని తెలిపింది. ఖమేనీ మృతితో ఇరాన్ 40 రోజుల సంతాపదినాలు, ఏడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఖమేనీ వీర మరణం పొందారు.. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారని, ఖమేనీ మరణంతో ఇరాన్ గొప్ప విప్లవ నాయకుడికి కోల్పోయిందని స్పష్టం చేసింది. దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారు అని తెలిపింది. 1989నుంచి ఖమేనీ ఇరాన్ సుప్రీంలీడర్ గా ఉన్నారు.
పక్కా సమాచారంతోనే అమెరికా, ఇజ్రాయెల్ లు ఖమేనీని అంతం చేశాయని, ఆ దేశాలు ఎంతో పెద్ద నేరం చేశాయని, దానికి జవాబు చెప్పలేకుండా ఉండలేమని ఇరాన్ ప్రకటించింది. అమెరికా స్థావరాలపై వినాశకర దాడులు చేస్తామని హెచ్చరించింది. మరోవైపు ఖమేనీ మరణ వార్త వెలువడిన వెంటనే ఇరాన్ ప్రజలు శనివారం సాయంత్రం నుంచే పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకున్నారు. ప్రజలు తమ బాల్కనీల నుంచి బాణసంచా కాలుస్తూ, అపార్ట్‌మెంట్ల నుంచి ఒకరినొకరు పిలుచుకుంటూ సంతోషం పంచుకున్నారు. ఆకాశంలో యుద్ధ విమానాలు లేదా క్షిపణులు వెళుతున్నప్పుడు కూడా ప్రజలు కేరింతలు కొడుతున్న దృశ్యాలు కనిపించాయి.