స‌మ‌స్య‌లు వింటూ.. ఆదేశాలు జారీ చేస్తూ..

MLA Prem Sagar Rao:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం మంచిర్యాల‌లో నిర్వ‌హించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30, 16, 53 డివిజన్లలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ‌న ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని అక్క‌డిక‌క్క‌డే సంబంధిత అధికారులతో మాట్లాడి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. త‌మ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like