పిచ్‌పై మ‌ట్టి తిల‌కంలా..

Captain Suryakumar Yadav:కోట్లాది మంది అభిమానుల ఆశల‌ను నిజం చేస్తూ టీం ఇండియా త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించిన విష‌యం తెలిసిందే. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా ముచ్చటగా మూడోసారి టైటిల్‌ కొల్లగొట్టి టీ 20 ప్ర‌పంచ‌క‌ప్‌లో విజ‌యం సాధించింది. సూర్యకుమార్‌యాదవ్‌ నేతృత్వంలోని భారత్‌ అప్రతిహత విజయాలతో న్యూజిలాండ్‌ భరతం పట్టింది.

ఈ సంద‌ర్భంగా అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఎన్నో ఉద్విగ్న క్ష‌ణాలు.. త‌మ క‌ల నిజ‌మైనందుకు… ఎన్నో ఏండ్లుగా క‌ష్ట‌ప‌డుతున్నందుకు త‌మ చేతికి క‌ప్పు అందిన వేళ వారు ఒక్కొక్క‌రు ఒక్కో రకంగా స్పందించారు. ప్రపంచ కప్‌లో భారతదేశం విజయం సాధించిన తర్వాత, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గౌరవ సూచకంగా అహ్మదాబాద్ పిచ్ ద‌గ్గ‌ర ఉన్న మ‌ట్టిని తన నుదిటిపై తిల‌కంగా దిద్దుకున్నారు. భారతదేశం ఛాంపియన్లుగా నిలిచిన తర్వాత నరేంద్ర మోడీ స్టేడియంలోని పిచ్‌లో ఈ భావోద్వేగ క్షణం అభిమానులను అల‌రించింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like