దండేప‌ల్లి మండలంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో ఇద్ద‌రి మృతి

దండేప‌ల్లి మండ‌లంలో చోటు చేసుకున్న విషాద‌క‌ర సంఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మృత్యువాత ప‌డ్డారు. ఇదే ఘ‌ట‌న‌లో మ‌రో ఇద్ద‌రు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. వివ‌రాల్లోకి వెళితే.. దండేప‌ల్లి మండ‌లం మ్యాద‌రిపేట పెట్రోల్‌పంప్ వ‌ద్ద న‌లుగురు కూలీలు ప‌నుల కోసం ఇనుప నిచ్చెన తీసుకువ‌చ్చారు. అది తీసుకువ‌స్తుండ‌గా, పైన ఉన్న విద్యుత్ వైర్లు త‌గ‌ల‌డంతో న‌లుగురు విద్యుత్‌ఘాతానికి గుర‌య్యారు.

దీంతో చుట్టుప‌క్క‌ల వారు టైర్ల‌ను ఇద్ద‌రి మెడ‌కు వేసి వారిని లాగేశారు. అయితే, మ‌రొ ఇద్ద‌రిని మాత్రం కాపాడేందుకు ప్ర‌య‌త్నించ‌గా అప్ప‌టికే వారు మంట‌ల్లో కాలిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో దండేప‌ల్లి మండ‌లం వెల్గ‌నూరుకు చెందిన చంద్ర‌గిరి నాగ‌రాజు (30), మ్యాద‌రిపేట‌కు చెందిన న‌ల్ల ల‌క్ష్మినారాయ‌ణ‌(ఎడ్డెన్న‌) అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. నాగ‌రాజుకు ఇద్ద‌రు పిల్ల‌లు కాగా, ల‌క్ష్మినారాయ‌ణ‌కు సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది. పెట్రోల్ పంప్ వ‌ద్ద‌నే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పిన‌ట్లైంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like