అంగన్వాడి వైపు అడుగు… చిన్నారి భవిష్యత్తుకు బంగారు బాట

జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్

అంగన్వాడి వైపుగా చిన్నారులు వేసే ప్రతి అడుగు బంగారు భవిష్యత్తుకు బాట అని జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ అన్నారు. శనివారం మంచిర్యాలలోని రామ్ నగర్ సెక్టార్ లో నిర్వహించిన అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమానికి సీడీపీవో విష్ణు ప్రియ, సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడీ టీచర్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు.

అంగన్వాడీ కేంద్రాలలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించడంతో పాటు సమయానుసారంగా పిల్లల ఎత్తు, బరువు లను నమోదు చేస్తార‌ని… వారి శారీరక, మానసిక ఎదుగుదలను పర్యవేక్షిస్తార‌ని స్ప‌ష్టం చేశారు. పోషణ్ అభియాన్ లో భాగంగా చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామ‌న్నారు. ఆరోగ్యం, పోషణ, విద్యతో పిల్లల భవిష్యత్తు ప్రగతి బాటలో నడిపేందుకు కృషి చేస్తార‌ని వెల్ల‌డించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు , పిల్లల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like