రేపు డీజీపీ ఆదిలాబాద్ పర్యటన
DGP CV Anand:డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో సమావేశం అవుతారు. పలు ప్రారంభోత్సవాలు చేయనున్న ఆయన, ప్రజా పాలనలో భాగంగా నిర్వహించే గ్రామసభలో పాల్గొంటారు. మొట్టమొదటిసారిగా డీజీపీ ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు అన్నిరకాలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు.
డీజీపీ పర్యటన వివరాలు.
ఉదయం 9:30 గంటలకు జిల్లా పోలీస్ అధికారులతో క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించనున్నారు…
11:30 గంటలకు ఏ ఆర్ హెడ్ క్వార్టర్స్ ఎంటీ సెక్షన్ లో నూతనంగా హైడ్రాలిక్స్ ప్రారంభిస్తారు..
11:40 గంటలకు చిల్డ్రన్ పార్క్ ప్రారంభం, పోలీసు ఫ్యామిలీ క్వార్టర్స్ ప్రారంభిస్తారు.
11:45 గంటలకు డీపీవో కార్యాలయం ఎదురుగా ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించనున్నారు…
12 గంటలకు కలెక్టర్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభం…
12:05 గంటలకు గుడిహత్నూర్ మండలం తోషం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా నిర్వహించే గ్రామసభ లో పాల్గొంటారు.. ఇందులో తోషం గ్రామంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం.. యువతకు హెల్మెట్స్, వాలీబాల్ కిట్లు పంపిణీ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో యువతకి లర్నింగ్ లైసెన్స్ లు అందజేస్తారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా జిల్లా విపత్తు నిర్వహణ కు సంబంధించిన నూతన పరికరాల అందజేస్తారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. ప్రజలకు కంటి వైద్య పరీక్షలు, కంటి అద్దాల అందజేయనున్నారు. ప్రమాదాలు జరిగిన సందర్భంలో అత్యవసర పరిస్థితుల్లో జరిపే సిపిఆర్ పై శిక్షణలో పాల్గొంటారు. అదే విధంగా ఆటో డ్రైవర్లకు ప్రథమ చికిత్స కిట్లను అందజేస్తారు.
మధ్యాహ్నం 1:10 గంటలకు తిరిగి ఆదిలాబాద్ వచ్చి… హెడ్ క్వార్టర్స్ మీడియా సమావేశంలో పాల్గొంటారు.