గాలి వాన బీభత్సం.. చిన్నారి ప్రాణం బలి

Child dies after house collapses:గాలి వానకు ఇల్లు కూల‌డంతో ఓ బాలిక మృతి చెందిన విషాద ఘ‌ట‌న మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం అచ్చులాపూర్‌లో చోటు చేసుకుంది. ఏమూర్ల సునైత్రి (5) మ‌రో చిన్నారి ఇంట్లో ఆడ‌కుంటుడ‌గా ఇంటితో పాటు ప‌క్క‌నే ఉన్న గోడ కూలి సునైత్రిపై ప‌డింది. దీంతో ఆ బాలిక అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయింది. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

విషయం తెలుసుకున్న వెంటనే బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్(Bellampalli MLA Vinod) ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా అందాల్సిన అన్ని సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.  ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like