బాసర ఆలయంలో చోరీ

బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భారీ చోరీ జరిగింది. అక్కడి మహంకాళి అమ్మవారి ఆలయ తలుపులు పగలగొట్టిన దొంగలు… వెండి కిరీటం, హుండీని ఎత్తుకుపోయారు. బాసర ఆలయం మొదటి అంతస్థులో మహంకాళి అమ్మవారి ఆలయం ఉంది. రాత్రి డ్యూటీలో ఆరుగురు ఉద్యోగులు ఉన్నా… అయినా చోరీ జరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, సిసిటివి (CCTV) ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.

2024 ఆగస్టులో కూడా ఈ ఆలయ పరిధిలో పెద్ద చోరీ జరిగింది. :ఒక దొంగ క్యూలైన్ల మీదుగా వచ్చి గోశాల పైనుంచి ఆలయంలోకి ప్రవేశించాడు. ఆలయ ప్రాంగణంలోని దత్తాత్రేయ స్వామి హుండీని, ప్రసాదం కౌంటర్లలోని నగదును పగలగొట్టి సుమారు ₹20,000 దొంగిలించాడు. ఆధారాలు దొరకకుండా ఉండేందుకు దొంగ కొన్ని సీసీ కెమెరాలను కూడా పగలగొట్టాడు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు అప్పట్లో నలుగురు హోంగార్డులపై జిల్లా ఎస్పీ వేటు వేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like