బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు

Balk Suman : సింగరేణి సంస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట లభించింది. బాల్కసుమన్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచీకత్తుతో హైకోర్టు బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు చేసింది.

సింగరేణి సంస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది. గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీయడంతో సింగరేణి యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమన్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

సుమన్ రూ. 25 వేల వ్యక్తిగత బాండ్ తో పాటు, ఇద్దరి పూచీకత్తు సమర్పించాలనే నిబంధనపై బెయిల్ లభించింది. కోర్టు విధించిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని, దర్యాప్తునకు సహకరించాలని ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like