తెలంగాణ‌లో భారీగా డీఎస్పీల బ‌దిలీలు

Transfer of DSPs in Telangana: తెలంగాణ పోలీస్ శాఖలో భారీ స్థాయిలో అధికారుల బదిలీలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 36 మంది డీఎస్పీలు, ఏసీపీలను బదిలీ చేస్తూ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) ఉత్తర్వులు జారీ చేశారు.బదిలీ అయిన అధికారులకు సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, రోడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, సీసీఆర్బీతో పాటు వివిధ కమిషనరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాల్లో పోస్టింగ్‌లు కేటాయించారు. రామగుండం కమిషనరేట్‌కు పలువురు ఏసీపీలను నియమించగా, సిద్దిపేట, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, సైబరాబాద్ తదితర ప్రాంతాల్లో కూడా కీలక నియామకాలు జరిగాయి.

అలాగే సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, ఫంక్షనల్ వర్టికల్స్ వంటి విభాగాల్లో పలువురు డీఎస్పీలకు బాధ్యతలు అప్పగించారు. ఈ బదిలీలతో రాష్ట్ర పోలీసు శాఖలో పరిపాలనా పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కొత్త విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

బదిలీ అయిన అధికారులు, వారి కొత్త పోస్టింగులు…

1.కంప రవీందర్: ఏసీపీ, సీసీఎస్, రామగుండం

2.బొలగాని శ్రీనివాసరావు: ఏసీపీ, టాస్క్ఫోర్స్, రామగుండం

3.టి. ప్రవీణ్ కుమార్: ఏసీపీ, సీసీఎస్, రామగుండం

4.ఎం. వెంకట రామయ్య: డీఎస్పీ, రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ బాసర

5.ఎం. వెంకట నరసయ్య: డీఎస్పీ, డీసీఆర్డీ, ఫంక్షనల్ వర్టికల్స్, ఆదిలాబాద్

6.బొబ్బాల ప్రవీణ్: డీఎస్పీ, ఇంటెలిజెన్స్

7.బూర శ్రీనివాస్: డీఎస్పీ, రోడ్ సేఫ్టీ (నార్త్ జోన్)

8.జీ. వెంకటేశ్వర్లు: డీఎస్పీ, ఎస్బీ, సిరిసిల్ల

9.జీ. మహేందర్ రెడ్డి: డీఎస్పీ, ఏసీబీ

10.గొర్ల సీతారెడ్డి: డీఎస్పీ, వీఅండ్

11.బి. బాలాజీ: ఏసీపీ, టాస్క్ ఫోర్స్, సిద్దిపేట

12.అడప నరసింహారావు: ఏసీపీ, సీసీఆర్బీ, ఖమ్మం

13.సి. విజయ్ రాజు: డీఎస్పీ, PCS&S, చీఫ్ ఆఫీస్

14.పబ్బతి వెంకటేశ్వర్లు: డీఎస్పీ, సీఐడీ

15.కీత రామకృష్ణ: ఏసీపీ, సీఎస్ డబ్ల్యూ, హైదరాబాద్ ప్యూచర్ సిటీకి అటాచ్

16. కొద్ది భాస్కర్: డీఎస్పీ, డీసీఆర్బీ, ఫంక్షనల్ వర్టికల్స్, రాజన్న సిరిసిల్ల

17.పి. కరుణాకర్ రెడ్డి: ఏసీపీ, ఎస్పీ, హైదరాబాద్ సిటీ

18.ఎం. వెంకట్ రెడ్డి: డీఎస్పీ, ఇంటెలిజెన్స్

19. పాఠ రాజు: డీఎస్సీ, టీజీ సీఎసీ

20.నూనె వెంకటేశ్వర్లు: డీఎస్పీ, వీఅండ్‌ఈ

21.జీ.గోవర్ధన గిరి: ఏసీపీ, ఎస్పీ, హైదరాబాద్ సిటీ

22. ఎస్.వెంకటేష్: ఏసీపీ, క్రైమ్స్, సైబరాబాద్

23.బి.గురునాయుడు: ఏసీపీ, సీసీఆర్బీ, ఫంక్షనల్ వర్టికల్స్, నిజామాబాద్

24.భూపతి గట్టుమల్లు: డీఎస్పీ, డీసీఆర్, ఫంక్షనల్ వర్టికల్స్, కామారెడ్డి

25.బి. హరినాథ్ బాబు: ఏసీపీ, సీటీసీ, ఖమ్మం

26.చిలుక రాజిరెడ్డి: డీఎస్పీ, సీఐడీ

27.ఆర్. నరేందర్: ఏసీపీ, టాస్క్ఫోర్స్, నిజామాబాద్

28.ఆవుల రాజయ్య: డీఎస్పీ, ఇంటెలిజెన్స్

29.సంకెళ్ల వెంకటేష్: డీఎస్పీ, సీఐడీ

30.ఎ.పెద్దన్న కుమార్: డీఎస్సీ, పీటీసీ, అంబర్ పేట‌

31.తోటిచర్ల స్వామి: ఏసీపీ, సీసీఆర్బీ, ఫంక్షనల్ వర్టికల్స్, కరీంనగర్

32.. పి. సృషిలం: ఏసీపీ, సీసీఎస్, నిజామాబాద్

33.కె. పురుషోత్తం: ఏసీపీ, ఎస్బీ, సైబరాబాద్

34.సర్ల రాజు: ఏసీపీ, సీసీఎస్ & డీడీ, హైదరాబాద్ సిటీ

35.గడ్డం సదయ్య సదన్ కుమార్: ఏసీపీ, సీసీఎస్, సిద్దిపేట

36.ఎం. రాజేష్: డీఎస్సీ, ఏసీబీ

Get real time updates directly on you device, subscribe now.

You might also like