ఏసీబీ వ‌ల‌లో మ‌రో అవినీతి అధికారి

కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలిచిన పెద్దపల్లి మున్సిపాలిటీలో ఈ ఘటన మరోసారి చర్చనీయాంశంగా మారింది.

పెద్దపల్లి మున్సిపాలిటీలో మరోసారి అవినీతి బాగోతం బట్టబయలైంది. పెద్దపల్లి మున్సిపాలిటీలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) సతీష్ పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ జి. మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో, మున్సిపల్ పరిధిలో చేపట్టిన ఓ పనికి సంబంధించిన బిల్లులు, అధికారిక ప్రక్రియ పూర్తి చేయడానికి ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.

లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఏఈ సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, లంచం డిమాండ్ చేసిన పరిస్థితులు, తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో పెద్దపల్లి మున్సిపాలిటీలో మరోసారి అవినీతి వ్యవహారం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like