ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

నిందితుడి అరెస్ట్: లక్షెట్టిపేట జైలుకు తరలింపు

పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన‌ ప్రియుడు మొహం చాటే యడంతో ప్రియురాలు అతని ఇంటి ముందు బుధవారం ధర్నాకు దిగింది. తాండూర్ మండలం అచ్చలాపూర్ గ్రామానికి చెందిన కొట్టె రవి అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. మూడేళ్లుగా పెళ్లి చేసుకుంటానని చెప్పి మొహం చాటేశారు. దీంతో ప్రియుడి ఇంటి ముందు యువతి బంధువులతో కలిసి ధర్నాకు దిగింది. తాండూర్ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, తమ కుమార్తెను వివాహం చేసుకుంటానని మోసం చేయడంతోనే వారం కింద‌ట‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని నాలుగు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొంది వచ్చిందని తెలిపారు. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు తల్లిదం డ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు.

నిందితుడి అరెస్ట్: లక్షెట్టిపేట జైలుకు తరలింపు
కొట్టె రవిని అరెస్టు చేసి రిమాండ్ త‌ర‌లించిన‌ట్లు తాండూరు పోలీసులు తెలిపారు. మహిళను వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీనిపై బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాండూరు పోలీస్ స్టేషన్‌లో Cr.No: 108/2026, U/s 69 BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి బెల్లంపల్లి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా, అనంతరం అతనిని లక్షెట్టిపేట సబ్ జైలుకు తరలించినట్లు తాండూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలిపారు.

You might also like