డ‌ప్పు కొట్టి.. పాడె మోసి…

తెలంగాణ ఉద్య‌మ కారుడు, మంద‌మ‌ర్రి ప‌ట్ట‌ణ బీఆర్ఎస్ అధ్య‌క్షుడు జే.ర‌వీంద‌ర్ అంతిమ‌యాత్ర గురువారం నిర్వ‌హించారు. ఆ యాత్ర‌లో ప‌లువురు నాయ‌కులు పాల్గొని ర‌వీంద‌ర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మాజీ ఎంపీ, BRS పార్టీ జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్‌, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు డ‌ప్పు కొట్టారు. సుమ‌న్ డ‌ప్పు కొట్ట‌డ‌మే కాకుండా పాడె మోశారు. తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మిర్యాల రాజిరెడ్డి, మాజీ జిల్లా ప‌రిష‌త్ ఉపాధ్య‌క్షుడు మూల రాజిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర SC, ST కమిషన్ సభ్యుడు రేణికుంట్ల ప్రవీణ్ త‌దిత‌రులు పాడె మోసి నివాళి అర్పించారు.

 

You might also like