లారీలో చెల‌రేగిన మంట‌లు.. డ్రైవ‌ర్, 200 మేక‌లు స‌జీవ‌ద‌హ‌నం

లారీలో మంటలు చెల‌రేగి ఓ వ్య‌క్తి స‌జీవ ద‌హ‌నం కాగా, సుమారు 200 వంద‌ల మేక‌లు మృత్యువాత ప‌డ్డాయి. హైద‌రాబాద్ నుంచి క‌ర్నూల్‌కు మేక‌ల లోడ్ వెళ్తున్న లారీ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా భూత్పూర్ వ‌ద్ద అదుపు త‌ప్పింది. జాతీయ ర‌హ‌దారిపై ప‌క్క‌నే ఉన్న రెయిలింగ్‌తో పాటు సూచిక బోర్డును ఢీకొట్టింది. ప్ర‌మాద తీవ్ర‌త‌కు ఇంధ‌న ట్యాంక్ ప‌గ‌ల‌డ‌టంతో లారీలోఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. డ్రైవ‌ర్ తేరుకునే లోపే మంట‌లు వ్యాపించి స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. డ్రైవ‌ర్‌తో పాటు అందులో ఉన్న 200 మేక‌లు స‌జీవ‌ద‌హ‌న‌మ‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఇదే ఘ‌ట‌న‌లో మ‌రో ఐదుగురు గాయ‌ప‌డ్డారు. వారిని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఎస్పీ జాన‌కి, డీఎస్పీ వెంక‌టేశ్వ‌ర్లు అక్క‌డికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఘ‌ట‌న త‌ర్వాత ట్రాఫిక్ జాం కావ‌డంతో పోలీసులు వాహ‌నాన్ని ప‌క్క‌కు తొల‌గించి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తు వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగిందా..? లేదా మ‌రేదైనా కార‌ణ‌మా..? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

You might also like