ఆ మూడు అక్షరాలంటే.. ముఖ్యమంత్రికి ముచ్చెమటలే..
ముఖ్యమంత్రికి ఆ మూడక్షరాల పేరంటే ముచ్చెమటలు పడతాయని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) అన్నారు. గోదావరిఖనిలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జనలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్(KCR) అనే మూడక్షరాల పేరంటే చాలా మంది భయేపడేవారు. మరీ ఇప్పుడు రాష్ట్రంలో కేటీఆర్(KTR) అనే మరో మూడక్షరాల పేరు వింటేనే రేవంత్ రెడ్డి భయపడుతున్నరని వెల్లడించారు. అప్పుడు, కేసీఆర్… ఇప్పుడు కేటీఆర్ అనే పదం వింటే వణుకుపుడుతోందన్నారు. రేవంత్ రెడ్డి కండ్లు మూసినా.. తెరిసినా నిద్రలో కూడా కేటీఆర్.. కేటీఆర్ అనే కలువరిస్తున్నాడని… ప్రజా సమస్యల మీద కేటీఆర్ గట్టిగా గొంతెత్తి నిలదీయడమే అందుకు కారణమన్నారు. నీట్ పరీక్షల విషయంలో కేటీఆర్ తన పుట్టిన రోజు కూడా లెక్కచేయకుండా ఇందిరాపార్క్ ధర్నాలో కూర్చున్నాడని వెల్లడించారు. అట్లా పోరాటం చేస్తున్నడు కాబట్టే కేటీఆర్ ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడని స్పష్టం చేశారు. కేటీఆర్ ఉద్యమ శిఖరమని… ఆయన కేసీఆర్ బిడ్డ పారే రక్తం ఎక్కడిది..? ఉద్యమ రక్తమని సుమన్ వెల్లడించారు. లాగుల తొండలు ఇడుస్త. కండ్ల గుండ్లు పీకేస్త అనేటోన్ని చూసి ఆ రక్తం భయపడుతదా..? నువ్వు ఎన్ని కేసులైనా పెట్టుకో, ఎంత బద్నాం అయినా చేసుకో.. నేను మాత్రం ప్రజల కోసం పోరాటం చేస్తా అంటూ రామన్న మన ముందుకు వచ్చాడని బాల్క సుమన్ వెల్లడించారు.