కేసీఆర్ ఫాం హౌస్కే ఆ వెసులుబాటు ఎందుకు..?
కొండపోచమ్మ నుంచి పంచపాండవుల చెరువుకు కాలువ తవ్వారు. అక్కడి నుంచి మోటార్ల ద్వారా నేరుగా కేసీఆర్ ఫామ్ హౌస్కి నీరు వెళ్తుంది…. రాష్ట్రంలో ఎవరికీ లేని ప్రత్యేక వెసులుబాటు.. కేసీఆర్ ఫామ్ హస్కే ఎందుకు? ఈ నీటి ఎత్తిపోతలపై నిజనిర్ధారణకు మేం సిద్ధం” అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) సవాల్ విసిరారు. ఎల్నినో పరిస్థితులపై మంత్రులతో చర్చ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కమీషన్ల కోసం కాళేశ్వరం పేరిట రూ.లక్ష కోట్లను గోదావరిలో వృథాగా పోశారని దుయ్యబట్టారు. మేడిగడ్డను మొత్తం కూల్చేసి మళ్లీ కట్టాలని కేంద్ర నిపుణుల కమిటీ చెప్పిందని సీఎం స్పష్టం చేశారు.
“కృష్ణా జలాల్లో మన వాటాను తగ్గించి.. తెలంగాణకు మరణశాసనం రాసిందెవరు? కృష్ణా జలాల్లో 299 టీఎంసీలు చాలని 2015లో సంతకం చేసిందెవరు? పదేళ్లలో కృష్ణా ” బేసిన్లో ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినా.. నీటిని నిల్వ చేసుకుని ఉండేవాళ్లం. దాదాపు వంద దేశాల్లో ఎల్నిలో ప్రభావం ఉంది. మరి వంద దేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే కరవు వచ్చిందా? అని ప్రశ్నించారు.
ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎల్నినో.. కొవిడ్ లాంటి సంక్షోభం అని అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మార్చిలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు నమోదవుతున్నాయని…. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల విద్యుత్ వినియోగం పెరిగిందని సీఎం వెల్లడించారు. అక్టోబర్ నెలలో ఇంత విద్యుత్ డిమాండ్ గతంలో ఎప్పుడూ లేదన్నారు. సాధారణంగా అక్టోబర్ నెలలో 15వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని, కానీ…. ఇప్పుడు అది 20వేల మెగావాట్లకు పెరిగిందని వెల్లడించారు. అయినప్పటికీ సరిపడా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.