చెరువులో పడి కానిస్టేబుల్ మృతి
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం దుగ్నేపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వీరబోయిన సమ్మయ్య (43) చెరువులో పడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు వేమనపల్లి మండలం నీల్వాయి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రమాదవశాత్తు పడి ప్రాణాలు కోల్పోయాడా…? ఆత్మహత్య చేసుకున్నాడా..? అనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 5 గంటలకు ఇంటి నుంచి యథావిధిగా సమ్మయ్య వాకింగ్, బహిర్భూమికి వెళ్లాడు. సమ్మయ్య ఇంటికి రాక పోయే సరికి అతని గురించి అతని భార్య, కుటుంబ సభ్యులు ఊర్లో వెతుకుతుండగా. మధ్యాహ్నం దుగ్నేపల్లి గ్రామ శివారు గల నక్కకుంట చెరువులో మృతుడు చనిపోయి ఉన్నాడు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.