ట్రంప్‌కు బిగ్‌షాక్
అనుకున్నట్లే అయ్యింది… డోనాల్డ్ ట్రంప్ కు మధ్యంతర ఎన్నికల ఫలితాలు కోలుకోలేని రాజకీయ ఎదురుదెబ్బగా మారాయి. రిపబ్లికన్ పార్టీ పరాజయం పాలు కాగా, యూఎస్ సెనెట్ నియంత్రణను డెమొక్రాట్లు హస్తగతం చేసుకున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ సంప్రదాయకంగా రిపబ్లికన్లకు కంచుకోటలుగా ఉన్న టెక్సాస్, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా రాష్ట్రాల్లో డెమొక్రాట్లు ఘన విజయం సాధించి సీట్లను ఎగరేసుకుపోవడమే కాకుండా, కీలకమైన జార్జియా, న్యూ హాంప్‌షైర్ స్థానాలను విజయవంతంగా నిలబెట్టుకున్నారు.
ఈ విజయంతో వాషింగ్టన్ అధికార సమీకరణాల్లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. 100 మంది సభ్యులుండే యూఎస్ సెనెట్‌లో 2020 ఎన్నికల తర్వాత డెమొక్రాట్లు తిరిగి పూర్తి ఆధిపత్యాన్ని దక్కించుకున్నారు. ఇప్పటివరకు 53-47 ఆధిక్యంతో ఉన్న రిపబ్లికన్లు సెనెట్‌పై పట్టు కోల్పోయారు. దేశవ్యాప్తంగా రిపబ్లికన్ అభ్యర్థుల తరఫున ట్రంప్ స్వయంగా విస్తృత ప్రచారం నిర్వహించినా ఓటర్లు డెమొక్రాట్లకే పట్టం కట్టారు. అధ్యక్షుడిగా ట్రంప్ చివరి రెండేళ్ల పదవీకాలం మిగిలి ఉన్న తరుణంలో ఈ ఎన్నికలు ఆయన నాయకత్వానికి, రాజకీయ ప్రభావానికి గట్టి పరీక్షగా నిలిచాయి.
అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది తెలుగు ఎన్ఆర్ఐలు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఈ ఫలితాలు అత్యంత కీలకం. హెచ్-1బీ వీసా విధానాలు, గ్రీన్ కార్డ్ నిబంధనలు, నిత్యావసరాల ధరలపై ట్రంప్ సర్కార్ తీసుకునే తీవ్రమైన నిర్ణయాలను అడ్డుకోవాలంటే కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల విజయం అవసరమని అక్కడి తెలుగు వర్గాలు భావిస్తున్నాయి. సెనెట్‌లో అధికారం చేపట్టాలంటే రిపబ్లికన్ల నుంచి కనీసం నాలుగు స్థానాలను కైవసం చేసుకోవాల్సిన డెమోక్రాట్లకు మొదటి నియోజకవర్గంలోనే భారీ విజయం దక్కింది1 నార్త్ కరోలినా మాజీ గవర్నర్, డెమోక్రాట్ అభ్యర్థి రాయ్ కూపర్ తన ప్రత్యర్థి, రిపబ్లికన్ నేత మైఖేల్ వాట్లీపై ఘన విజయం సాధించి ఆ స్థానాన్ని డెమోక్రాట్ల ఖాతాలో వేశారు.
ఈ ముందస్తు ఫలితాల సరళితో రిపబ్లికన్ పార్టీ క్యాంప్‌లో తీవ్ర ఆందోళన మొదలైంది. జార్జియా రాష్ట్రంలో రిపబ్లికన్ ప్రచార బృందాలు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నట్లు సీఎన్ఎన్ నివేదించింది. ఓటర్ల భాగస్వామ్యం తమ అంచనాలను అందుకోలేకపోయిందని, కీలకమైన సెనెట్, గవర్నర్ స్థానాల్లో డెమోక్రాట్లు ముందంజలో ఉన్నారని రిపబ్లికన్ వర్గాలు అంగీకరిస్తున్నాయి. ఒకవేళ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌ను డెమోక్రాట్లు కైవసం చేసుకుంటే, ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదించే బడ్జెట్లతో పాటు ఆయన అనుసరించే చట్టపరమైన అజెండాను అడ్డుకునే పూర్తి అధికారం వారికి లభిస్తుంది! అంతేకాకుండా ట్రంప్ యంత్రాంగంపై పార్లమెంటరీ విచారణలను ముమ్మరం చేసే వెసులుబాటు కలుగుతుంది.
మరోవైపు సెనెట్‌లో కూడా రిపబ్లికన్లు ఓడిపోతే, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలు, అత్యున్నత ప్రభుత్వ అధికారుల ఎంపిక విషయంలో ట్రంప్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేరు. పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం, ఇరాన్‌తో యుద్ధం వంటి అంశాలపై అమెరికా ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తికి ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా మారుతున్నాయి.