మూడేండ్ల వ‌ర‌కు రీచార్జ్ అవ‌స‌రం లేదు..

రిలయన్స్ జియో టెలికాం రంగంలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ మేర‌కు ఓ కొత్త ప్లాన్ త‌న వినియోగ‌దారుల కోసం తీసుకువ‌చ్చింది. ఈ కొత్త ప్లాన్ దాదాపు మూడేండ్ల పాటు వ్యాలిడిటీ ల‌భించ‌నుంది. రూ. 10,000తో 3 సంవత్సరాల (36 నెలల) వ్యాలిడిటీ అందించే అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను అధికారికంగా విడుదల చేసింది. తరచూ రీఛార్జ్ చేసుకునే జంఝాటం లేకుండా, భవిష్యత్తులో టారిఫ్ ధరలు పెరిగినా ఎలాంటి అదనపు భారం పడకుండా ఉండాలనుకునే వారి కోసం జియో ఈ ప్లాన్‌ను రూపొందించింది.

ఈ ప్లాన్‌తో అన్‌లిమిడెట్ కాలింగ్‌, ఎస్ఎమ్ఎస్ (SMS), డేటా ప్ర‌యోజ‌నాలు, ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు సైతం స‌మ‌కూర‌నున్నాయి. భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా 3 ఏళ్ల పాటు ఉచితంగా లోకల్, ఎస్టీడీ కాల్స్ మాట్లాడుకోవచ్చు. రోజుకు 100 SMSల చొప్పున వాడుకునే సదుపాయం ఉంది. ఇక ప్రతిరోజూ 2.5 GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది (3 సంవత్సరాల కాలానికి మొత్తం సుమారు 2,737 GB బేస్ డేటా అందుతుంది). జియో ట్రూ 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అర్హులైన 5G స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అపరిమితంగా 5G డేటాను ఎంజాయ్ చేయవచ్చు.

ఇందులో లైవ్ స్పోర్ట్స్, ప్రీమియం ఎంటర్‌టైన్‌మెంట్, హాలీవుడ్ కంటెంట్ చూడటానికి JioHotstar (మొబైల్ + హాలీవుడ్) సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఆఫీస్ లేదా పర్సనల్ డిజైనింగ్ పనుల కోసం 12 నెలల పాటు ఉచిత Canva Pro Lite సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ చేస్తున్నారు. ఫోటోలు, డాక్యుమెంట్లు సురక్షితంగా దాచుకోవడానికి 50 GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది.

You might also like