పెరిగిన చలి.. పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. కొన్ని రోజులపాటు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో చలి ప్రభావం తగ్గి జిల్లా ప్రజలు కొంత ఉపశమనం పొందారు. అయితే, రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. ఉత్తరాది నుండి వీస్తున్న గాలుల కారణంగా మరింత చలి తీవ్రత పెరిగింది. కొన్ని రోజులపాటు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో చలి ప్రభావం తగ్గి జిల్లా ప్రజలు కొంత ఉపశమనం పొందారు. అయితే రెండు రోజుల నుండి జిల్లాలో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగిపోయింది. శీతల గాలులు కూడా తోడవడంతో పల్లె, పట్టణాలు తేడా లేకుండా ప్రజలు వణుకుతున్నారు. ఉష్ణోగ్రతలు మరింత పడిపోతుండటంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ప్రధాన రహదారులను దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది.
దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 14.7 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రతలు కాగా, నిర్మల్, కొమురం భీం జిల్లాల్లో 15 డిగ్రీలు గా నమోదు అయ్యింది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో మరింత తక్కువగా ఈ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా పొగమంచుతో ఉదయం ఏడు గంటల వరకు విపరీతమైన చలి ఉంటోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గి చలి పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.