భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ఒక్కసారిగా దిగివచ్చాయి. దేశీయ బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి రేట్లు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌ పరిణామాలు, ముడిచమురు ధరలు, రూపాయి మారకం విలువలో మార్పులు, డిమాండ్ సరఫరా పరిస్థితులు ధరలపై ప్రభావం చూపుతున్నాయని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం భారీ తగ్గుదల
హైదరాబాద్‌లో మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,250గా ఉండ‌గా, బుధవారం నాటికి రూ.3,946 తగ్గి రూ.1,26,304కు చేరింది. ముంబయి, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, ప్రొద్దుటూరు తదితర నగరాల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,150గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ స్పాట్‌ గోల్డ్‌ ధర 3,556.30 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వెండి ధర కూడా భారీగా పతనం
బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. హైదరాబాద్‌లో మంగళవారం కిలో వెండి ధర రూ.1,58,536గా ఉండగా, బుధవారం రూ.8,776 తగ్గి రూ.1,49,760కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ స్పాట్‌ సిల్వర్‌ ధర 40.76 డాలర్ల వద్ద ఉంది. పారిశ్రామిక అవసరాలు, పెట్టుబడిదారుల నుంచి వచ్చే డిమాండ్‌, అంతర్జాతీయ మార్కెట్‌ పరిణామాలు వెండి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి. వీటి ప్రభావంతో దేశీయ మార్కెట్‌లోనూ వెండి ధరలు మారుతున్నాయి.

ప్రధాన నగరాల్లోనూ ఇదే ట్రెండ్
దేశంలోని ప్రధాన నగరాల్లోనూ పసిడి ధరలు ఇదే ధోరణితో కొన‌సాగాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,22,460 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,12,255గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్లు రూ. 1,22,270, 22 క్యారెట్లు రూ. 1,12,081 వద్ద ట్రేడయ్యాయి. చెన్నైలో ఇవే ధరలు వరుసగా రూ. 1,22,560, రూ. 1,12,347గా నమోదు కాగా, బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ. 1,22,360, 22 క్యారెట్లు రూ. 1,12,163 వద్ద స్థిరపడ్డాయి. ఈ ధరల తగ్గుదలతో నగల దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి.

You might also like