అన్న.. బాగున్నవా…?
హైదరాబాద్ :శాసనసభా సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించి శాసనసభలోకి వచ్చిన మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను మంత్రి కేటీఆర్ కలిశారు. అన్నా బాగున్నావా.. అని ఆప్యాయంగా పలకరించారు. శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్, రాజాసింగ్‌ను పలకరించారు. అనంతరం కాంగ్రెస్, ఎంఐఎం ఎమ్మెల్యేలతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పలకరించారు. వారికి కేటాయించిన సీట్ల వద్దకే కేటీఆర్ వెళ్లి పలకరించడం గమనార్హం.