డప్పు కొట్టం..
తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని అందుకే ఇక నుంచి గ్రామంలో ఎవరు చనిపోయినా డప్పు కొట్టమని దళితులు తీర్మానించారు. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రపెల్లి గ్రామానికి చెందన దళితులు తమకు ప్రభుత్వ పథకాలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్నారని తమకు అది రాలేదన్నారు. ఇక దళిత బంధు కింద 20 మందికి ఇస్తామని చెప్పారని అది కూడా తమకు హ్లామెట్ గ్రామమైన చర్లపల్లి గ్రామస్థులకు ఇచ్చారని అన్నారు. కనీసం తమను పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామంలోని దళితులు తీర్మానం చేశారు. ఏదైనా శుభకార్యం అయినా, ఎవరైనా చనిపోయినా డప్పు కొట్టబోమని, వేరే వాళ్లను ఇక్కడ డప్పు కొట్టని్వమని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం జడ్పీ వైస్‌చైర్మన్ తొంగల సత్యనారాయణ, సర్పంచ్ గడ్డం అశోక్ గౌడ్‌కు వినతిపత్రం అందచేశారు. గ్రామంలో దళితులకు న్యాయం జరిగే వరకు ఇలాగే కొనసాగిస్తామని రాచకొండ శంకర్, ఆవునూరి లచ్చయ్య, రాచకొండ కార్తీక్, రాచకొండ వెంకట్ నాందిన్యూస్‌కు వెల్లడించారు.