అక్క తోడుగా… భూ మాత నీడగా…
NREGS: తల్లి కష్టపడుతోంది. ఆ చిన్నోడికి నిద్ర ముంచుకు వచ్చింది.. ఇంకేం భూమాతే పట్టుపాన్పు అయ్యింది. అక్క తోడుగా ఉండటంతో ఆ చిన్నారి హాయిగా నిద్రపోయాడు. ఎన్ఆర్ఈజీఎస్(వంద రోజుల పని)లో భాగంగా తల్లి పని చేస్తుండటంతో తన బాబుని అక్కడే నీడలో పడుకోబెట్టింది. అక్క జాగ్రత్తగా చూసుకుంటుంగా ఆ బాబు నేలపైనే పడుకున్నాడు. తాండూరు మండలం మాదారం టౌన్షిప్ ప్రాంతంలో జరుగుతున్న పనిలో భాగంగా తీసిన చిత్రమిది..