సెంచరీ దాటిన టమాట

Tomato: దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. టమాట ధరలు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అన్ని రాష్ట్రాల్లో టమాట ధరలు 100కు పైగానే పలుకుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో టమాట ధరలు కిలో రూ.130 నుంచి రూ.150 వరకు ఉన్నాయి. టమాట ధర వంద రూపాయలు నడుస్తుంటే.. పచ్చిమిర్చి కూడా రూ.100కు దగ్గరగా వస్తోంది. అంత ధరపెట్టి టమాట, పచ్చి మిర్చి కొనుగోలు చేయలేకపోతున్నారు సామాన్యులు. టమాట,పచ్చిమిర్చి పంట దిగుబడి తగ్గిందని.. రోజూవారీగా మార్కెట్కు రావాల్సిన దానికంటే తక్కువ టమాట, పచ్చిమిర్చి మార్కెట్కు వస్తున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. మార్చి, ఏప్రిల్లో కురిసిన అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని ఈ పరిస్థితి నెలకొందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధరలు మళ్లీ తగ్గాలంటే ప్రస్తుతం వేసిన పంటలు మళ్లీ చేతికి రావాలని.. అప్పటి వరకు ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
గత నెలలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలతోపాటు దేశమంతటా కిలో టమాటా రూ.2-5 మధ్య పలికింది. ఇప్పుడు కిలో టమాటా ధర కేవలం నెల రోజుల్లో 1900 రెట్లు పెరిగింది. దిల్లీ మార్కెట్లలో కిలో టమోటా రూ.70-100 మధ్య విక్రయిస్తున్నారు. మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలో రూ.80-100 మధ్య ఉండగా, రాజస్థా్న్లో రూ.90 నుంచి రూ.110 మధ్య పలుకుతున్నాయి.