ఏలేటి దీక్ష భగ్నం
Eleti Maheshwar Reddy: బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఐదు రోజులుగా చేస్తున్న దీక్షను పోలిసులు భగ్నం చేశారు. సోమవారం తెల్లవారు జామున అయనను అదుపులోకి తీసుకొన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను జిల్లా ఆసుపత్రి తరలించారు. అయనను అదుపులోకి తీసుకునే సందర్భగా అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
మహేశ్వర్ రెడ్డి నిరాహార దీక్షని భగ్నం చేసేందుకు వచ్చిన పోలీసులను బిజేపి నేతలు అడ్డుకున్నారు. ముందు గేట్ కి తాళం వేసి పోలీసులను లోనికి రానివ్వలేదు. పోలీస్ గో బ్యాక్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో గేటు తాళం పగులగొట్టిన పోలీసులు మహేశ్వర్ రెడ్డి ఇంటి లోపలికి ప్రవేశించారు. పోలీసులను బీజీపీ నేతలు అడ్డుకునే క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. వైద్య పరీక్షలు చేసుకోవాలని మహేశ్వర్ రెడ్డికి పోలీసులు సూచించినా అయన నిరాకరించారు. దీంతో అప్పటికే అంబులెన్స్ సిద్ధం చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.