బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత

Bathini Harinath Goud :ఆస్తమా, ఉబ్బసం బాధితులకు చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ (Bathini Harinath goud) కన్నుమూశారు. బత్తిని సోదరుల్లో ఒకరైన 84 ఏండ్ల హరినాథ్ గౌడ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విష మించడంతో నిన్న రాత్రి బత్తిని హరినాథ్ గౌడ్ తుదిశ్వాస విడిచారు. ఆయన పేరు చెబితే చేపమందు గుర్తుకు వస్తుంది. బత్తిని హరినాథ్ గౌడ్ సోదరులు ఎన్నో ఏండ్లుగా చేపమందు పంపిణీ చేస్తున్నారు. ఆస్తమా వ్యాధి నివారణకు ఈ చేపమందు పంపిణీ చేస్తారు. ఏటా మృగశిర కార్తె రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబ సభ్యులు చేప మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. వేలాది మంది ఆస్తమా వ్యాధిగ్రస్తులు చేప మందు కోసం వస్తారు.