ఒక్క పైసా దొరకలేదు… గుడ్ బ్యాంక్
Bank robary: నాకు ఒక్క పైసా దొరక లేదు. గుడ్ బ్యాంక్ ఇది.. నన్ను పట్టుకోవద్దు.. ఫింగర్ ప్రింట్స్ దొరకవు… ఏంటి ఇదంతా అనుకుంటున్నారా…? ఒక దొంగ బ్యాంక్ దొంగతనానికి వచ్చాడు. అతనికి అందులో ఏం దొరక లేదు. దీంతో ఏం చేయలేక వెనుదిరిగాడు.వెళ్తూ వెళ్తూ.. ఒక పేపర్ పై విషయం రాసి మరీ వెళ్ళాడు..
వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలో దక్కన్ గ్రామీణ బ్యాంక్ ఉంది. గురువారం రాత్రి ఆ బ్యాంక్ లో ఒక వ్యక్తి దొంగతానికి ప్రయత్నించాడు. అది చాలా చిన్న బ్యాంక్ కావడంతో అందులో ఏం దొరక లేదు. దీంతో నిరాశతో వెనదిరిగిన దొంగ.. అక్కడే ఉన్న న్యూస్ పేపర్ పై మార్కర్ తో రాశాడు. నాకు ఒక్క పైసా దొరక లేదు. గుడ్ బ్యాంక్ ఇది.. నన్ను పట్టుకోవద్దు.. ఫింగర్ ప్రింట్స్ దొరకవు.. అని రాసి మరీ వెళ్ళిపోయాడు. ఉదయం బ్యాంక్ లో దొంగతనం గురించి తెల్సుకున్న పోలీసులూ క్లూస్ టీమ్ ద్వారా వివరాలు సేకరించారు. కేస్ నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.