చంద్రబాబే కుట్రకు సూత్రధారి
సీఐడీ రిమాండ్ రిపోర్టు

Chandrababu: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. ఇందులో చాలా కీలకమైన అంశాలు పొందుపరిచారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబే కుట్రకు సూత్రధారి అనే అంశాన్ని స్పష్టం చేశారు. అధికారుల ద్వారా బాబు కుట్రకు పాల్పడ్డారని వెల్లడించారు. కేవలం కంపెనీల ప్రతినిధులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ల ఆధారంగానే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారని వెల్లడించారు. పలు షెల్ కంపెనీల ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ. 279 కోట్లు దారి మళ్లించారని చెప్పారు. 90 శాతం సీమెన్స్ కంపెనీ భరిస్తుందని కేబినేట్ కు అబద్దం చెప్పారని తెలిపారు. అప్పటి ముఖ్యమంత్రి, సీఎస్ ఆదేశాలతో నిధులు విడుదలయ్యాయనే విషయాన్ని ఆ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేశారు. జీవోలో చెప్పినట్లు మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయకపోవడానికి కారణం కూడా చంద్రబాబు, అచ్చన్నాయుడే కారణమని స్పష్టం చేశారు. కేబీనేట్ తీర్మానాలకు పక్కన పెట్టి మరీ గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణలాంటి అధికారుల ద్వారా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని సీఐడీ తేల్చి చెప్పింది.