సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి
ఎస్ఆర్పీ 3 ఘటనపై బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య
ఎస్ఆర్పీ 3 ప్రమాద ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని బిఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు. ఆయన రామగుండం ఏరియా III, ఓసీపీ 2 లో గేట్ మీటింగ్లో మాట్లాడారు. గని ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా వెంటనే ప్రకటించాలన్నారు. సింగరేణి వ్యాప్తంగా రక్షణ చర్యలను విస్మరిస్తున్న సింగరేణి అధికారులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ లో జరిగిన ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. కార్మికులు, కార్మిక సంఘాల ఆందోళన చేసినా సింగరేణి యాజమాన్యం దాటవేసే ధోరణితో వ్యవహరించదన్నారు. యాజమాన్యం వారం రోజులలోపు రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు, సింగరేణి యాజమాన్యం, సీఅండ్ ఎండీ వెంటనే స్పందించి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి జనరల్ మేనేజర్, మైన్స్ గ్రూప్ ఏజెంట్, శ్రీరాంపూర్ ఏరియా సేఫ్టీ ఆఫీసర్, గని మేనేజర్,గని రక్షణాధికారి, వెంటిలేషన్ ఆఫీసర్ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వేణుగోపాల్ రావు, అరుకాల ప్రసాద్, మామిడి స్వామి, పోతరాజు రాజు, విద్యాసాగర్, ఉప్పులేటి శ్రీనివాస్ ,నగేష్ కొండ ఐలయ్య ,మర్రి సంతోష్ తదితరులు పాల్గొన్నారు