ఎమ్మెల్యే ఛాయ్… రూ. 100

నిజమే… ఒక ఛాయ్ వంద రూపాయలు.. ఇదేదో ఫైవ్ స్టార్ హోటల్లో లెక్క కాదు. రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్లో ధర ఇది. అయితే, ఈ ఛాయ్కు ఓ స్పెషల్ ఉందండోయ్… ఆ ఛాయ్ ఎమ్మెల్యే చేసింది.. ఆ మాత్రం ఉండదా..? ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓట్ల కోసం ఇంటింటికి కలుస్తూ వారిని ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. తాము చేసిన పనులు, చేసే పనులు చెబుతూ ప్రచారం చేస్తున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రచారంలో భాగంగా ఆదివారం కాసిపేట మండలం వేప వద్ద ప్రచారం చేశారు. అందులో భాగంగా ఆయన ఓ హోటల్లో తనే స్వయంగా పెట్టారు. నే పెట్టిన ఛాయ్ తాగుతారాయ్యా..? అంటూ ప్రశ్నించారు. తాగుతాం సార్ అంటూ వారు సమాధానం ఇవ్వగానే.. ఛాయ్ సిద్ధం చేసి ఒక్క ఛాయ్ రూ. 100 అనడంతో నేతలు, అక్కడ ఉన్న వారంతా నవ్వారు. అక్కడి నేతలకు ఛాయ్ అందించారు.