ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు
మంచిర్యాల జిల్లాలో ఉదయం7 గంటల నుంచి పొలింగ్ ప్రారంభం అయింది. పలువురు అభ్యర్థులు ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ తన ఓటు వేశారు. ఆయన సతీమణి రాణి అలేఖ్య ఓటుహక్కు వినియోగించుకున్నారు. మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో కుటుంబ సభ్యులతో కలసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.