సింగరేణి ఎన్నికలపై విచారణ 21కి వాయిదా

Singareni: సింగరేణి ఎన్నికలపై విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. సింగరేణి ఎన్నికలపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలను డిసెంబర్ 27కు బదులు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించాలని రాష్ట్ర ఇంధన శాఖ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన నేపథ్యంలో ఎన్నిన నిర్వహణకు సమయం కావాలని కోర్టును కోరారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో చెప్పారన్నా విషయాన్ని హైకోర్టు గుర్తుచేసింది. అయితే సింగరేణి ఎన్నికలు నిర్వహించేందుకు సమయం కావాలని కోరడంతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా వేసింది.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు మొదటి నుంచీ అవాంతరాలు ఎదు రవుతున్నాయి. ఈ ఎన్నికల విషయం లో ఎన్నికల నోటిఫి కేషన్ ఇచ్చే ముందు ఒకసారి గుర్తింపు సంఘం, ఆ తర్వాత యాజమాన్యం, మరో సారి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వేరువేరుగా ఎన్నికలను వాయిదా వేయించాయి. చివ రికి అక్టోబరులో వచ్చిన సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కూడా సింగరేణి గుర్తింపు ఎన్నికలకు అడ్డుగా మారాయి. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.