బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆత్మయత్యాయత్నం

నాంది, మంచిర్యాల
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయం ఆవరణలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆత్మయత్యాయత్నం చేసుకున్నాడు. తనపై అక్రమ కేసులు పెట్టారనే నెపంతో నస్పూర్ మున్సిపాలిటీ 21వ వార్డు కౌన్సిలర్ బేర సత్యనారాయణ సర్జికల్ బ్లేడ్ తో మెడ కోసుకుని ఆత్మహత్య యత్నం చేశారు. పోలీసులు అడ్డుకొని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీసీసీ నస్పూర్ మున్సిపాలిటీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించినందుకు, తిట్టినందుకు మున్సిపల్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో బేర సత్యనారాయణ పై అట్రాసిటీ కేసు నమోదు అయినట్లు సమాచారం. తన తండ్రిపై కావాలనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన కూతురు ఆవేదన వ్యక్తం చేశారు.