పిడుగుపడి రైతు మృత్యువాత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పిడుగు పడి ఓ రైతు మృత్యువాతపడ్డాడు. జిల్లాలోని పెంచికల్ పేట్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన రైతు సిడం శ్రీనివాస్ (45) పొలంలో పనిచేస్తున్నాడు. తను పనిచేస్తుండగా పొలంలోనే ఒక్కసారిగి పిడుగుపడటంతో అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.