పురిటిలోనే పసికందు మృతి
నాంది, కాగజ్ నగర్
రోడ్డు సౌకర్యం లేకపోవడంతో పురిటిలోనే ఓ పసికందు మృతి చెందింది. కొమురంభీం జిల్లా పెంచికలపేట మండలం మేరేగూడా గ్రామానికి చెందిన దుర్గం పంచపుల నిండు గర్భిణి. తనకి పురుటి నొప్పులు ప్రారంభం కావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అయితే గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మేరగూడ నుండి ఎడ్లబండి మీద ఎల్లురుకు వచ్చారు . అనంతరం అక్కడి నుండి అంబులెన్స్ లో కాగజ్‌నగర్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆలస్యం కావడంతో కడుపులోనే బిడ్డ మృతి చెందినట్లు వెైద్యలు తెలిపారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతోనే 3 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం గంట సేపు పట్టిందని తండ్రి పోషన్న ఆవేదన వ్యక్తం చేశారు.