ఆత్మీయ బంధానికి కిటికీ అడ్డం
నాంది, మంచిర్యాల : రక్షాబంధన్ అంటే సోదరుడు,సోదరీమణుల మధ్య ఆప్యాయతకు అనురాగాలకు ప్రతీక. ఎక్కడ ఉన్నా తన తోబుట్టువులకు రాఖీ కట్టాలని తపన పడుతుంటారు. ఎంత దూరమైనా సరే వెళ్లి రాఖీ కట్టి వస్తారు… అయితే, ఈ ఆత్మీయ అనుబంధానికి.. కనీసం రాఖీ కట్టించుకునేందుకు కూడా కొందరు అడ్డుకోవడంతో చివరకు హాస్టల్ గది నుంచే కిటికీలో నుంచే అక్కలు తమ్ముడికి రాఖీ కట్టిన వైనమిది… మంచిర్యాల రామక్రిష్ణపూర్ సోషల్ వెల్పేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న దాసరి అశ్విక, సహస్ర చదువకుంటున్నారు. వారి తమ్ముడు జితేంద్ర తండ్రితో కలిసి రాఖీ కట్టించుకునేందుకు వచ్చాడు. అయితే, సిబ్బంది రాఖీ కట్టించుకోవడానికి గురుకులంలోకి లోపలికి అనుమతించలేదు. దీంతో చేసేదేమీ లేక తండ్రి భుజం ఎక్కి జితేంద్ర అక్కలతో రాఖీ కట్టించుకున్నాడు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో జనం గురుకుల పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి కనీసం ఐదు, పది నిమిషాల సమయం కేటాయించి రాఖీ కట్టిస్తే బాగుడేందని దానికి అధికారులు ఇంత సీన్ చేయాల్సిన పని ఉండేది కాదు కదా అని దుయ్యబడుతున్నారు.