కలెక్టర్ వాహనం అడ్డగింత
నాంది, కాగజ్‌నగర్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానెపల్లి మండలం డబ్బా గ్రామంలో పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ వాహనాన్ని మలమహానాడు సంఘ నాయకులు అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణను ఆపాలంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దాదాపు 20 నిమిషాలపాటు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ ఆపాలంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే కి మాల మహానాడు నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు.