మంచిర్యాల‌లో వ్య‌భిచారం గుట్టుర‌ట్టు

నాంది, మంచిర్యాల : మ‌హిళ‌ల ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వారికి షార్ట్ ఫిలింలో అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని చెప్పి వారితో వ్య‌భిచారం చేయిస్తున్న వైనం బ‌య‌ట‌ప‌డింది. ఈ వ్య‌వ‌హారాన్ని మంచిర్యాల పోలీసులు బ‌య‌ట‌పెట్టారు. వివ‌రాల్లోకి వెళితే..

మంచిర్యాల సున్నం బ‌ట్టివాడ‌కు చెందిన కరుణాకర్ అనే వ్యక్తి ఎల్ఐసీ ఆఫీసు ఎదురుగా ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఈ ఇంటిని లీజుకు తీసుకొని బెల్లంప‌ల్లికి చెందిన శాతాని శంకర్ అనే వ్య‌క్తిని మేనేజర్ గా పెట్టినాడు శంకర్ గతంలో మీనాక్షి లాడ్జిలో పనిచేసిన అనుభవ ఉంది. శంక‌ర్ సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిల ఫోటోలను వారి ఫోన్ నెంబర్లను తెలుసుకొని వారిని ఇక్కడకు పిలిపించి ఈ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో వ్యభిచారం కొనసాగిస్తున్నాడు. క‌రీంన‌గ‌ర్‌కు చెందిన ఓ మ‌హిళ‌ను ఇక్క‌డ‌కు తీసుకువ‌చ్చాడు. ఆమెకు షార్ట్‌ఫిలింలో అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని, ఎక్కువ డ‌బ్బులు సంపాదించుకోవ‌చ్చ‌ని ఆశ చూపించి మంచిర్యాల తీసుకువ‌చ్చాడు. శంకర్ మాట నమ్మి ఆ మ‌హిళ మంగ‌ళ‌వారం రాత్రి కరీంనగర్ నుండి మంచిర్యాల వ‌చ్చి ప్రైవేటు గెస్ట్ హౌస్ కు వెళ్లింది. శంకర్ బాధిత మహిళ ఫోటోను మంచిర్యాల బెల్లంపల్లి సిసిసి నస్పూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, శ్రీరాంపూర్ లో త‌న‌కు తెలిసిన వారందరికీ వాట్సాప్ ద్వారా పంపించాడు.

విష‌యం తెలుసుకున్న కొప్పర్తి నవీన్ (బెల్లంపల్లి), దేవి పోలిమల్లు, గండి రమేష్ (రామకృష్ణాపూర్), ఔలిపాక రాజశేఖర్ (హమలివాడ మంచిర్యాల), గొల్లపల్లి శేఖర్ (సీసీసీ నస్పూర్) ఆ మ‌హిళ‌తో గ‌డిపేందుకు వ‌చ్చారు. అయితే, శంకర్ ఆరుగురు వ్యక్తులను బాధిత మహిళలకు షార్ట్ ఫిలిం మేకర్స్ అని పరిచయం చేసి వీరితో గ‌డిపితే షార్ట్ ఫిలింలో అవకాశాలు కల్పిస్తారని, డబ్బులు కూడా ఇస్తారని ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. తన ఆర్థిక పరిస్థితి కూడా సరిగా లేకపోవడంతో పాటు భర్త చనిపోయి కుటుంబ భారం ఇబ్బందికరంగా ఉండటంతో శంకర్ చెప్పిన మాటలను నమ్మి ఆ మ‌హిళ ఒప్పుకుంది.

స‌మాచారం అందుకున్న పోలీసులు వారందరినీ పట్టుకొని పోలీస్‌స్టేష‌న్ త‌ర‌లించారు. వీరి వద్ద నుండి 15,000 నగదు, మొబైల్ ఫోన్స్, కండోమ్ ప్యాకెట్ బాక్స్‌ల‌ను సీజ్ చేశారు. శంకర్ అందమైన అమ్మాయిలను ఇక్కడి గెస్ట్ హౌస్ కి పిలిపించి వారి ఫోటోలను మంచిర్యాల పరిసర ప్రాంతాల్లోని యువకులకు వాట్స‌ప్ ద్వారా పంపిస్తున్నాడు. వారిని గెస్ట్ హౌస్ కి పిలిపించి మహిళలతో కొంతకాలంగా వ్యభిచారం నడుపుతున్నాడు. ఈ విధంగా తాను సంపాదించిన డబ్బులలో కొంత‌ మొత్తం ఇంటిని లీజుకు తీసుకున్న కరుణాకర్ కు చెల్లిస్తున్నాడు. వ్యభిచార గృహం నడుపుతున్న శంకర్ తో పాటు పై ఆరుగురు విటులను అరెస్టు చేసి కోర్టులో హాజ‌రుప‌రిచారు. బాధిత మహిళను సఖి సెంటర్ ద్వారా వారి కుటుంబీకులకు అప్పగించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like