ప్రిన్సిపల్ వేధిస్తున్నాడని.. ఠాణా మెట్లెక్కిన విద్యార్థులు..

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మహాత్మాజ్యోతిబాపూలే విద్యార్థులు తమను ప్రిన్సిపల్, ఇతర టీచర్లు వేధిస్తున్నారంటూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పదవ తరగతి విద్యార్థులు హాస్టల్ నుంచి సుమారు 7 కిలో మీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ జిల్లా కేంద్రంలోని పోలీసుస్టేషను వచ్చారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యల గురించి చెబితే ప్రిన్సిపల్, వార్డెన్ వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ల మీద బ్యాడ్ అంటూ రిమార్క్ రాస్తానని బెదిరించారని విద్యార్థుల ఆరోపించారు. దాదాపు ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటాం అంటే నచ్చజెప్పి పోలీసు స్టేషన్ వచ్చామని విద్యార్థులు వెల్లడించారు. తెల్లవారు ఝామున మూడు గంటలకు గోడ దూకి వచ్చామని విలేకరులకు తెలిపారు. ప్రిన్సిపల్ ను తొలగిస్తేనే హాస్టల్ కు వెళ్తాం అంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
మహాత్మాజ్యోతిబాపూలే హాస్టల్ విద్యార్థుల సమస్యలు, పోలీస్ స్టేషన్ కు వచ్చిన చేసిన నిరసనతో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా విచారణ కు ఆదేశించారు. దీంతో హాస్టల్ లో బీసీ సంక్షేమ అధికారి రాజలింగు, ఆర్డీఓ వినోద్ విచారణ నిర్వహిస్తున్నారు. విద్యార్థులను పోలీసులు స్టేషన్ నుంచి హాస్టల్ కు బస్సులో పంపించారు.