బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Two killed in a road accident:కారు ద్విచక్ర వాహనం ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా, ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిర్మల్ జిల్లా దిలావార్ పూర్ మండలం లోలం గ్రామ సమీపంలో కారు ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో లోలం గ్రామానికి చెందిన ప్రశాంత్ (20) సంజయ్ (20) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉంది. జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.