సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య

Suicide by taking a selfie video:స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో నష్టపోవడమే కాకుండా, దానికోసం చేసిన అప్పులు, లోన్ యాప్లో డబ్బులు తీసుకొని అవి కట్టలేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. శ్రీరాంపూర్ అరుణక్క నగర్లో నివాసముండే నమ్తబాజీ శ్రీకాంత్ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసి నష్టపోయాడు. దానికోసం చేసిన అప్పులతో పాటు, లోన్ యాప్ లో సైతం డబ్బులు తీసుకున్నాడు. వీటన్నిటినీ కట్టే పరిస్థితి లేకపోవడటంతో నిన్న రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో తీసుకుని ఉరివేసుకున్నాడు.
అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. తక్కువ సమయం లో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఎవరు కూడా ట్రేడింగ్ చేసి సంపాదించిన డబ్బులు వృథా చేసుకోవద్దనీ వారు తెలిపారు. లోన్స్ యాప్స్ లో కూడా డబ్బులు తీసుకొని ఇబ్బందుల పాలు కావొద్దని విలువైన జీవితాన్ని కో ల్పోకూడదని స్పష్టం చేశారు.