కొనసాగుతున్న ఏజెన్సీ బంద్
Continued agency strike: ఆదివాసీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో విఫలం అవుతున్నాయని తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్, జిల్లా కోకన్వీనర్ వెట్టి మనోజ్ అన్నారు. తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తుడుం దెబ్బ, ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఏజెన్సీ బంద్ నిర్వహిస్తున్నారు. బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ గ్రామాలకు సరైన రోడ్డు మార్గం లేదని, విద్యుత్, విద్య, వైద్యం కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసులను రక్షించడానికి కూడా ప్రభుత్వాలు మొగ్గు చూపడం లేదన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో చదువుకున్న యువతీ యువకులు వయసు మీద పడుతున్నా వారికి ఉద్యోగం కల్పించడంలో కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువతకు ఉద్యోగాలు లేక, వ్యవసాయ పనులు చేయరాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఏజెన్సీ ప్రాంతానికి స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని 29 శాఖలలో బ్యాక్‌లాగ్ పోస్టులలో ఆదివాసీ యువతతో వెంటనే భర్తీ చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోకన్వీనర్ ఉయిక సంజివ్, మహిళా సంఘం జిల్లా కన్వీనర్ గోడంరేణుక, మహిళా సంఘం జిల్లా కో కన్వీనర్ ఉయికఇంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడు రాము, ఆదివాసి నాయకులు మేశ్రందినేష్ ఆత్రంభుజంగరావు, తోడసం ప్రకాష్, ఉయికచందు, కోట్నకరామారావు తదితరులు పాల్గొన్నారు
-ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట ఆదివాసీ నేతలు బైఠాయించి నిరసన తెలిపారు. బస్సులు బయటకు వెళ్లకుండా తుడుం దెబ్బ నాయకులు అడ్డుకున్నారు. పోలీసు అధికారులు తుడుం దెబ్బ నాయకుల నిరసనను భగ్నం చేయడంతో ఆదిలాబాద్ బస్టాండ్ నుంచి కొమురం భీం చౌక్ ఇంద్ర ప్రియదర్శని స్టేడియం దస్నాపూర్ పెట్రోల్ పంప్ వరకు శాంతి ర్యాలీతో నిరసన తెలిపారు.
-ఇచ్చోడ మండల కేంద్రంలో ఏజెన్సీ బంద్ మంగళవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మండల కేంద్రంలో తిరుగుతూ తెరిచి ఉన్న షాపులను బంద్ చేయించారు. జీవో నెంబర్ 3 యధావిధిగా కొనసాగించాలని, ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీ వేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ డిమాండ్ చేశారు.
-కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల రక్షణకు చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని, ఎస్టీ జాబితా నుండి లంబాడిని తొలగించాలని ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డీఎస్సీ ఏర్పాటు చేయాలని తిర్యాని, జైనూర్, సిర్పూర్ యు,లింగాపూర్, కేరమేరి, వాంకిడి ప్రాంతాల్లో ఏజెన్సీ బంద్ పిలుపునిచ్చిన ఆదివాసి సంఘాలు. ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్.
ఆదివాసీ సంఘాల డిమాండ్లు ఇవే..
-లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి
-ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి ఏర్పాటు చేయాలి
-జీవో ఎంఎస్ నంబర్ 3ని యదావిధిగా కొనసాగించాలి
-ఐటీడీఏలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ వేంటనే భార్తి చేయాలి
-29 శాఖలో ఉన్న జీవోలను చట్టంగ చేయాలని
-ఆదివాసి పోలీస్ బెటాలియన్ ఏర్పాటు చేయాలి
-సాగులో ఉన్న ప్రతి ఆదివాసికి పోడు భూముల పట్టాలు ఇవ్వాలి
-కొమురం భీం కాలనీలో నివాసముంటున్న ఆదివాసులకు ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి
-విద్యుత్, రోడ్లు, విద్య, వైద్యం సౌకర్యం కల్పించాలి
-తెలంగాణలో ఆదివాసీలకు పట్టణ కేంద్రాలలో ఇంటిస్థలాలు కేటాయించాలి
-ప్రతి ఒక్క రైతుకు ఎలాంటి షరతులు విధించకుండా రుణమాఫీ చేయాలి
-ఏజెన్సీ ప్రాంతంలో గుట్కా, నిషేధిత పదార్థాలు అరికట్టాలి