అధైర్యపడొద్దు.. అండగా ఉంటా.

ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆయన మంచిర్యాల గోదావరి నీటి మట్టాన్ని పరిశీలించారు. అదేవిధంగా గోదావరి తీరాన ఉన్న మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని సైతం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాను, అధికారులు అందుబాటులో ఉంటామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.. మాతా శిశు ఆసుపత్రి అధికారులు, డాక్టర్లు, పోలీస్ అధికారులతో మాట్లాడారు. ఆసుపత్రిలో ఉన్న బాలింతలను వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ మరియు రాంనగర్ ల్లో లోతట్టు ప్రాంతాలను సైతం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.