విపత్తుల సమయంలో రాజకీయాలు వద్దు

రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు

విపత్తుల సమయంలో రాజకీయాలు వద్దని, ప్రజలను ఇబ్బందులు నుంచి గెట్టెక్కించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం రాత్రి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి కడెం ప్రాజెక్టు పరిశీలించారు. ఈ సంధర్భంగా మాట్లాడారు. గతంలో అధికారంలో ఉన్నవాళ్లు వారి అనుభవాలతో సూచనలు చేయాలన్నారు. విపత్తులను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న ప్రజలను గట్టెక్కించడం కోసం సమిష్టిగా పని చేయాలని కోరారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. జిల్లాలోని ఖానాపూర్, దస్తురాబాద్, పెంబి మండలాలలో అధిక వర్షపాతం నమోదు అయినందున నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ మంత్రికి వివరించారు. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చెరువులో వాగుల సమీపంలోకి ప్రజలు వెళ్లకుండా రెవెన్యూ, పోలీస్ అధికారులను అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. రోడ్లపై వాగులు ప్రవహిస్తున్న చోట్ల బారికేడ్ లు ఏర్పాటు చేసి ప్రజలు, వాహనాలు వెళ్లకుండా జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డి ఆర్ ఓ భుజంగరావు, ఆర్డిఓ లు రత్న కళ్యాణి కోమల్ రెడ్డి, డిఎస్పి గంగారెడ్డి, పోలీసు రెవెన్యూ నీటిపారుదల శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like