CCI వెంటనే పునః ప్రారంభించాలి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడ్డ సిమెంట్ పరిశ్రమ పునఃప్రారంభించాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన సిసిఐ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీసీఐ పునరుద్ధరణకు కేంద్రం చర్యలు చేపట్టాలన్నారు. సిసిఐ స్క్రాప్ వేలం వేసే ప్రక్రియను కేంద్రం వెంటనే ఆపేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ఓపెన్ చేయాలనీ మరోమారు డిమాండ్ చేశారు. పెట్టుబడులు రావాలి, ఉపాధి కల్పించడమే మా లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సిమెంట్ కంపెనీ ప్రారంభానికి చర్యలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సిసిఐ పై వాస్తవిక పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. సీసీఐ ముందుకొచ్చి పరిశ్రమ తిరిగి ప్రారంభించాలని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.