ఎంసీహెచ్ పేషెంట్లకు భోజనం పంపిణీ
నాంది, మంచిర్యాల
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల గోదావరి తీరంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రిలోని పేషెంట్లను ముందు జాగ్రత్త చర్యగా పట్టణంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులలో చేర్పించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద, వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు పేషెంట్లను తరలించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే వారిని సోమవారం వివిధ ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. వారందరికీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేశారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రులకు వెళ్లి భోజనం అందించి వచ్చారు.