గిరిజన మహిళపై హత్యాచారయత్నం
ఓ ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం చేయడమే కాకుండా, ఆమెపై హత్యాయత్నం కూడా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివాసీ జిల్లా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి. జైనూరు మండలం దేవుగూడ గ్రామానికి చెందిన ఓ ఎస్టీ మహిళ జైనూర్ పనిమీద వచ్చి అక్కడి నుంచి ఆమె తల్లిగారి ఊరు సోయంగూడ నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ షేక్ ముగ్దమ్ అనే వ్యక్తి తన ఆటోలో ఎక్కించుకున్నాడు. రాఘవాపూర్ దాటిన తర్వాత ఆమెపై బలాత్కారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో ఆమెను వదిలేశాడు. అయితే, ఆమెను చంపేందుకు కర్రతో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఆ మహిళ చనిపోయిందని అనుకుని రోడ్డు మీద పడేసి వెళ్లిపోయాడు. ఈ మేరకు సిర్పూరు(యు) పోలీసులు మహిళపై అత్యాచార యత్నం, హత్యాయత్నం, SC/ ST చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. నేరస్తున్ని అదుపులోకి తీసుకొని ఆసిఫాబాద్ కి తరలించారు. రేపు నేరస్థుడ్ని కోర్టులో ప్రవేశ పెడతామని ఆయన వెల్లడించారు.
మక్దూంను ఉరితీయాలని ఆందోళన..
ఆదివాసి మహిళ పై అత్యాచారం చేసి చంపే ప్రయత్నం చేసిన మక్దూం అనే వ్యక్తిని ఉరితీయాలని ఆదివాసుల డిమాండ్ చేశారు. జైనూర్ మండల కేంద్రంలో. కొమరం భీమ్ చౌక్ వద్ద ఆదివాసీ యువకులు నాయకులు పెద్ద ఎత్తున నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాక్దుం అనే వ్యక్తి ఆదివాసీ మహిళను పెళ్లి చేసుకుని మరో ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం చేసి హత్య చేయడానికి ప్రయత్నించాడని, తాము కాపాడడానికి వెళ్లగా వారిపై ఇనుప రాడుతో దాడి చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి మానవమృగాలను వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతనికి ఉరిశిక్ష వేయాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ చేశారు రేపు ఏజెన్సీ ప్రాంతంలో సంపూర్ణగా బంద్ పాటించాలని ఆదివాసీ నాయకులు డిమాండ్ పిలుపునిచ్చారు.