రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా శనిగరపు సురేందర్
కోటపల్లి మండలం అన్నారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో భౌతిక రసాయన శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు శనిగారపు సురేందర్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యాడు. విద్యార్థులకు భౌతిక రసాయ శాస్త్రాన్ని పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తూ, విద్యార్థులను చిన్నారి శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో తనదైన ముద్ర వేస్తూ ప్రతి సంవత్సరం పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలు, ఇన్స్పైర్ మనకు అవార్డ్స్, జవహర్లాల్ నెహ్రూ సైన్స్ మ్యాథమెటిక్స్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిబిషన్స్, ఇంటింటా ఎన్నోవేటర్ అవార్డ్స్ వంటి కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం పాల్గొంటూ జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో ,వివిధ అవార్డులను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. హైదరాబాద్ లో గురువారం జరగనున్న ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్ల పంపిణీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సురేందర్ అవార్డ్ అందుకోనున్నారు.